Russian YouTuber: రష్యన్‌ యూట్యూబర్‌కు దిల్లీలో వేధింపులు

నిత్యం రద్దీగా ఉండే దిల్లీలోని సరోజినీనగర్‌ మార్కెట్లో ఓ రష్యన్‌ మహిళా యూట్యూబర్‌ను ఆకతాయి కుర్రాడు వెంటపడి వేధించాడు.

Updated : 21 Oct 2023 11:10 IST

నిత్యం రద్దీగా ఉండే దిల్లీలోని సరోజినీనగర్‌ మార్కెట్లో ఓ రష్యన్‌ మహిళా యూట్యూబర్‌ను ఆకతాయి కుర్రాడు వెంటపడి వేధించాడు. ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఆమెతో మాట కలిపేందుకు ప్రయత్నించి వేధించిన వీడియో వైరల్‌గా మారింది. రష్యాకు చెందిన ఈ మహిళా యూట్యూబర్‌కు ‘కోకో ఇన్‌ ఇండియా’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ఉంది. ఈమెకు హిందీ బాగా తెలుసు. భారత్‌లో రకరకాల ప్రదేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తుంటుంది. ఇందులో భాగంగా దిల్లీలోని సరోజినీనగర్‌ మార్కెట్‌కు వెళ్లి.. ఆ ప్రదేశాన్ని చూపిస్తూ లైవ్‌ ప్రారంభించింది. అదే సమయంలో యువకుడు వెంటపడ్డాడు. ‘‘మీ వీడియోలు రోజూ చూస్తుంటా.. మీతో స్నేహం చేయాలనుకొంటున్నా.. చాలా అందంగా ఉన్నారు’’ అంటూ ఆమెను అనుసరించాడు. నవ్వుతూ ఓపిగ్గా బదులిచ్చిన ఆ యువతి తనకు కలిగిన అసౌకర్యాన్ని దాచుకునే ప్రయత్నం చేసింది. చివరకు ఆ యువకుడు ఆమెకు క్షమాపణ చెప్పి నిష్క్రమించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని