మొయిత్రాపై ఆరోపణల వ్యవహారం.. ఆ వ్యాపారవేత్త అఫిడవిట్‌ అందింది: ఎథిక్స్‌ కమిటీ

తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రాపై భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే ఫిర్యాదు వ్యవహారంలో వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని ఆఫిడవిట్‌ తమకు అందినట్లు లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ శుక్రవారం వెల్లడించింది.

Published : 21 Oct 2023 05:21 IST

దిల్లీ: తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రాపై భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే ఫిర్యాదు వ్యవహారంలో వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని ఆఫిడవిట్‌ తమకు అందినట్లు లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ శుక్రవారం వెల్లడించింది. ‘దర్శన్‌ హీరానందాని అఫిడవిట్‌ మాకు అందింది. అందులో ఆయన మొయిత్రాపై చేసిన ఆరోపణలు తీవ్రమైనవి. నిషికాంత్‌ దూబే చేసిన ఫిర్యాదును ఎథిక్స్‌ కమిటీ ఈ నెల 26 విచారిస్తుంది. ఆ రోజున ఆయన తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలి. మొదట మేం దూబే రాసిన లేఖ, హీరానందాని అఫిడవిట్‌ను పరిశీలిస్తాం. ఆ తర్వాత మొయిత్రా వాదన వింటాం’ అని ఎథిక్స్‌ కమిటీ ఛైర్మన్‌ వినోద్‌ సోంకార్‌ జాతీయ మీడియాకు వెల్లడించారు.

మొయిత్రా న్యాయవాది చర్యపై దిల్లీ హైకోర్టు విస్మయం

భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే న్యాయవాదికి టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేందుకు మొయిత్రా న్యాయవాది గోపాల్‌ శంకర్‌నారాయణన్‌ చేసిన ప్రయత్నంపై దిల్లీ హైకోర్టు శుక్రవారం విస్మయం వ్యక్తం చేసింది. న్యాయమూర్తి అసంతృప్తి నేపథ్యంలో శంకర్‌నారాయణన్‌ కేసు నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో కేసు విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు న్యాస్థానం ప్రకటించింది. తన పరువుకు భంగం కలిగించే వార్తలను ప్రచారం చేయకుండా దూబేను నిలువరించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మొయిత్రా దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని