Marriage: సర్కారు సొమ్ము కోసం ఉత్తుత్తి పెళ్లిళ్లు

ఎదురుగా వరుడు లేకుండానే వందలాది యువతులు తమ మెడల్లో తామే వరమాలలు వేసుకొని పెళ్లి చేసుకున్నారు.

Updated : 01 Feb 2024 05:52 IST

ఎదురుగా వరుడు లేకుండానే వందలాది యువతులు తమ మెడల్లో తామే వరమాలలు వేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో జరిగింది. వారు ఎందుకిలా చేశారో తెలుసుకుంటే విస్తుపోవాల్సిందే. పేదల పెళ్లిళ్ల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాల యువతీ యువకులకు ఆర్థికసాయం కింద రూ.51,000 అందజేస్తోంది. అక్రమంగా లబ్ధి పొందాలనే దురాశతో కొందరు అధికారులు దళారులతో చేతులు కలిపారు. ఆ మేరకు జనవరి 25న మనియర్‌ పట్టణ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక పెళ్లిళ్ల కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకువచ్చారు. పెళ్లి కాని, పెళ్లయిన యువతీ యువకులకు డబ్బు ఎర చూపారు. ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారడంతో పోలీసులు 8 మంది అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరికీ నిధులను విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని