ఆజం ఖాన్‌కు ఏడేళ్ల జైలుశిక్ష

ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు స్థానిక కోర్డు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. 2016లో దుంగార్పుర్‌లో ఒక ఇంటిని బలవంతంగా కూల్చివేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది.

Published : 19 Mar 2024 04:16 IST

రాంపుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు స్థానిక కోర్డు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. 2016లో దుంగార్పుర్‌లో ఒక ఇంటిని బలవంతంగా కూల్చివేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. రూ.8లక్షల జరిమానాను కూడా విధించింది. ఈ కేసులో మరో ముగ్గురికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.2.5లక్షల చొప్పున జరిమానాను విధించింది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ ఇంటి కూల్చివేత జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక కేసు నమోదైంది. ఆజం ఖాన్‌.. ప్రస్తుతం మరో క్రిమినల్‌ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని