2-3 రోజుల్లో 5లక్షల టన్నుల ఉల్లి సేకరణ

ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించడం వల్ల మార్కెట్లో ఈ నిత్యావసర వస్తువు ధర పడిపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం స్పందించింది.

Published : 27 Mar 2024 04:27 IST

కేంద్ర ప్రభుత్వం వెల్లడి

దిల్లీ: ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించడం వల్ల మార్కెట్లో ఈ నిత్యావసర వస్తువు ధర పడిపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం స్పందించింది. 2-3 రోజుల్లో 5లక్షల టన్నుల రబీ ఉల్లిని కొనుగోలు చేసి, అన్నదాతల ప్రయోజనాలను కాపాడతామని తెలిపింది.

ఉల్లి ఎగుమతులపై ఈ నెల 31 వరకూ నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ ఈ నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు గతవారం ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షల ప్రభావం వర్తకులపైనే ఉందని, రైతులపై లేదని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ తాజాగా తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కిలో ఉల్లి టోకు ధర రూ.13-15గా ఉంటోందని చెప్పారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అని వివరించారు. ఒకవేళ ధరలు పడిపోతే.. రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని తెలిపారు. 2023-24లో ఖరీఫ్‌, రబీ సీజన్లలో 6.4 లక్షల టన్నుల ఉల్లిని కిలోకు రూ.17 ధరతో సేకరించామని చెప్పారు. బఫర్‌ స్టాక్‌ కోసం మార్కెట్‌ ధరతో ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటుందని వివరించారు. అయితే అది.. ఉత్పత్తి ధర కన్నా తక్కువకు పడిపోతే కనీసం రైతులకు పెట్టుబడైనా లభించేలా చూస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని