బిహార్‌లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు

బిహార్‌లోని కిషన్‌గంజ్‌ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది.

Published : 07 May 2024 04:16 IST

ఈటీవీ భారత్‌: బిహార్‌లోని కిషన్‌గంజ్‌ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. అయిదుగురు శిశువులూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. కిషన్‌గంజ్‌ జిల్లాలోని ఠాకుర్‌గంజ్‌కు చెందిన తాహీరా బేగం గర్భంలో అయిదుగురు శిశువులు ఉన్నట్లు వైద్యులు ముందే గుర్తించారు. ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఠాకుర్‌గంజ్‌ కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు సురక్షితంగా ప్రసవం చేశారు. తాహీరాకు ఇదివరకే ఒక కుమారుడు ఉన్నాడు. మహిళ గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఏకకాలంలో ఫలదీకరణం చెందడం వల్ల ఇలా ఒకే కాన్పుల్లో ఎక్కువమంది శిశువులు జన్మిస్తారని డాక్టర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని