Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌కు హైకోర్టులో ఊరట

సనాతన ధర్మం వ్యాఖ్యల అంశంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. 

Published : 06 Mar 2024 17:05 IST

చెన్నై: డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin)కు స్వల్ప ఊరట లభించింది. సనాతన ధర్మంపై వ్యాఖ్యల వివాదంలో ఆయనతో పాటు మరో ఇద్దరు నేతలు చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది.

గతేడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మాన్ని (sanatana dharma) నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పటి కార్యక్రమంలో పాల్గొన్న పీకే శేఖర్ బాబు, స్టాలిన్ వ్యాఖ్యలు సమర్థించిన ఎంపీ ఎ.రాజా పేర్లను అందులో చేర్చారు. ఈ విచారణ వేళ కోర్టు మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టింది. అయితే ఇంతవరకు ఆయన దోషిగా తేలలేదని గుర్తుచేసిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

మీరొక మంత్రి.. ఆ మాత్రం తెలియదా?: ఉదయనిధి ‘సనాతన’ వ్యాఖ్యలపై సుప్రీం

అయితే ఇటీవల స్టాలిన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా? మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారు’ అంటూ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. మార్చి 15న దానిపై తదుపరి విచారణ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని