
Drugs: లక్షద్వీప్ తీరంలో రూ.1,526 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
దిల్లీ: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), భారత తీర రక్షక దళం (ఐసీజీ) అధికారులు భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. లక్షద్వీప్ తీరంలో పడవల్లో తరలిస్తున్న 218 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. ‘ఆపరేషన్ ఖొజ్బీన్’ పేరుతో అగట్టి తీరంలో డీఆర్‌ఐ, ఐసీజీ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు చేశారు. కిలో ప్యాకెట్ల చొప్పున రెండు బోట్లలో రవాణా చేస్తున్న 218 పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ మార్కెట్‌లో సుమారు రూ.1,526 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. పలువురిని అరెస్టు చేసి, పడవలను కొచ్చికి తరలించారు.
గత రెండు నెలల వ్యవధిలో దేశంలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడటం ఇది నాలుగోసారి. ఏప్రిల్ నుంచి 3800 కిలోలకు పైగా హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ మొత్తంగా దాదాపు రూ.26,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
WHO: మహమ్మారి మార్పు చెందుతోంది.. ముగిసిపోలేదు..!
-
India News
MLAs Dance: మహారాష్ట్ర సీఎంగా శిందే.. ఎగిరి గంతులేసిన రెబల్ ఎమ్మెల్యేలు
-
Movies News
Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
General News
HMDA: హెచ్ఎండీఏ ఈ-వేలానికి ఆదరణ.. తుర్కయాంజిల్‌లో గజం రూ.62,500
-
Politics News
Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్