Corona: ఉద్ధృతి కొద్దిగా తగ్గినా.. 40వేల పైనే కొత్త కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా నిత్యం 40 వేలపైనే కేసులు నమోదవుతున్నాయి.
పెరుగుతోన్న క్రియాశీల రేటు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా నిత్యం 40 వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 14,28,984 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..40,134 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే 4 శాతం మేర తగ్గాయి. కేరళలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ మళ్లీ 20వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఇక నిన్న 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.16 కోట్లకు చేరగా.. 4.24 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు.
ఇటీవల కాలంలో క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 4,13,718 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.30 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది. నిన్న 36,946 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.08 కోట్లుగా ఉంది. మరోవైపు నిన్న 17లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 47.22కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పాఠశాల భోజనంలో పాము.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Politics News
Balakrishna-Jr NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నివాళి
-
Movies News
iifa 2023 awards winners: ఉత్తమ నటుడు హృతిక్ రోషన్.. నటి అలియా భట్
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్