Mamata Banerjee: రైళ్లలో ప్రయాణికుల భద్రత, ఛార్జీలపై దీదీ ప్రశ్నలు!

రైళ్లలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఛార్జీలను తగ్గించాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు.

Updated : 19 Nov 2023 15:51 IST

Mamata Benarjee | కోల్‌కతా: రైళ్లలో ప్రయాణికుల భద్రత, ఛార్జీల అంశంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మాజీ మంత్రి మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. రైళ్లలో ప్రయాణికులకు భద్రతపై దృష్టి పెట్టి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, టిక్కెట్ల డైనమిక్‌ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైలు ఛార్జీలు కొన్నిసార్లు విమాన టిక్కెట్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు.  రైల్వే ప్రయాణికులకు ఛార్జీల భారం పెరుగుతోందన్నారు. సువిధ రైళ్లలో ఛార్జీలు కొన్నిసార్లు విమాన టికెట్‌ ఛార్జీల కన్నా ఎక్కువగా ఉండటం విచారకరమని పేర్కొన్నారు. అలాంటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో సామాన్యులు ఎలా వెళ్లగలరు? అని ప్రశ్నించారు.

ఆలయమంతా బంగారు వర్ణమే.. శరవేగంగా అయోధ్య రామమందిర పనులు

రైళ్లలో టికెట్‌ ఛార్జీల పెంపును తగ్గించాలని, ప్రయాణికుల భద్రతాపరమైన అంశాలపై దృష్టిసారించాలని ఈ సందర్భంగా దీదీ కోరారు. దేశంలో రైలు ప్రమాదాల సంఖ్యను ప్రస్తావించిన దీదీ..  రైల్వేమంత్రిగా తాను పనిచేసిన సమయంలో రైలు ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు  ప్రవేశపెట్టిన ప్రమాద నిరోధక పరికరాలు, ఇతర ప్రమాద నివారణ చర్యల్ని ఎందుకు ఉపయోగించడంలేదని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని