Mamata Banerjee: అదే జరిగితే ‘ఈసీ’ ఎదుట దీక్ష చేస్తా: దీదీ

కేంద్రంలోని భాజపాకు ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. 

Published : 15 Apr 2024 19:07 IST

కోల్‌కతా: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ఎన్నికల కమిషన్‌ కార్యాలయం (EC) ఎదుట తాను నిరాహార దీక్ష చేపడతానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) హెచ్చరించారు. కేంద్రంలోని భాజపా (BJP)కు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అలీపుర్‌దువార్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న దీదీ ఈసీపై ఈ వ్యాఖ్యలు చేశారు.

భాజపా ఆదేశాలమేరకు ముర్షిదాబాద్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ను ఈసీ తొలగించిందని ఆరోపించారు. ‘‘భాజపా ఆదేశాల మేరకు ఈసీ పని చేస్తోంది. అందుకే ముర్షిదాబాద్‌ డీఐజీని తొలగించింది. అలర్లు, హింసను ప్రేరేపించేందుకు కాషాయం పార్టీ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ముర్షిదాబాద్‌, మాల్దాలో అలర్లు జరిగినట్లయితే దానికి ఈసీ బాధ్యత వహించాల్సిందే. అవసరమైతే ఈసీ కార్యాలయం ఎదుట 55 రోజుల పాటు నిరాహార దీక్షకు నేను సిద్ధం’’ అని దీదీ వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ధన వర్షం.. రోజుకు రూ.100కోట్లు సీజ్‌!

ఐటీకి సవాల్‌

జైల్లో ఉన్న ప్రతిపక్ష నేతలను భాజపా బెదిరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘‘మీకు ఎన్ని కారాగారాలు, ఎంతమంది పోలీసులు అనుకూలంగా ఉన్నారో నేనూ చూస్తాను. మీరు ఎంతమందిని బాధించగలరు? నాపై చాలాసార్లు దాడి జరిగింది. ఎలా పోరాడాలో నాకు బాగా తెలుసు’’ అని అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ హెలికాప్టర్‌లో ఐటీ సోదాలు నిర్వహించడంపై ఆమె స్పందించారు. ధైర్యముంటే భాజపా నాయకులు ప్రచారానికి తిరుగుతున్న హెలికాఫ్టర్లలో సోదాలు నిర్వహించగలరా అని ఐటీకి సవాల్‌ విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని