Haryana Police: నూహ్‌ అల్లర్లు.. పోలీసుల అదుపులో మోనూ మానేసర్‌!

హరియాణాలో నూహ్‌ అల్లర్లలో నిందితుడిగా భావిస్తున్న మోనూ మానేసర్‌ను పోలీసులు అరెస్టు చేశాడు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల హత్యకేసులోనూ అతడు నిందితుడు.

Published : 12 Sep 2023 17:04 IST

చండీగఢ్‌: హరియాణాలోని నూహ్‌లో చెలరేగిన అల్లర్ల (Nuh Violence)లో నిందితుడిగా భావిస్తున్న మోనూ మానేసర్‌ (Monu Manesar)ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మార్కెట్‌ ప్రాంతంలో అతడిని పట్టుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. నూహ్‌లో హింసను ప్రేరేపించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ అల్లర్లలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 286 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

హరియాణాలోని మానేసర్‌కు చెందిన మోనూ అసలు పేరు మోహిత్‌ యాదవ్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడి భివానీ జిల్లాలో ఓ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తుల హత్య కేసులోనూ అతడు నిందితుడు. రాజస్థాన్‌కు చెందిన ఆ ఇద్దరిని కొంతమంది గోరక్షకులు అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఓ కారులో కాలిపోయిన స్థితిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అప్పటినుంచి మోనూ తప్పించుకు తిరుగుతున్నాడు.

దిల్లీ పోలీసుల కోడ్‌భాషలో పాండోరా.. సమర అంటే ఏమిటో తెలుసా..?

ఈ క్రమంలోనే జూలై 31న నూహ్‌లో మతపరమైన ఊరేగింపులో పాల్గొంటానని అతడు ప్రకటించాడు. చివరకు ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఇందులో మోనూ పాత్రపై విచారణ చేపడతామని హరియాణా పోలీసులు తెలిపారు. మరోవైపు.. జంట హత్యల కేసులో అతడిని రాజస్థాన్‌ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని