Nitin Gadkari: కాంట్రాక్టర్లు, డీపీఆర్‌లకు రేటింగ్‌లు ఇవ్వాల్సిందే : గడ్కరీ

స్టీల్‌, సిమెంటు రంగంలోని పెద్ద కంపెనీలు ఒక్కసారిగా ధరలు పెంచే ప్రయత్నాల్లో మునిగిపోతున్నాయని (Companies form Cartels) కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published : 17 Oct 2023 17:19 IST

దిల్లీ: జాతీయ రహదారుల అభివృద్ధిలో ఎదురయ్యే ఆటంకాలపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన సాంకేతికతను అంగీకరించేందుకు సంబంధిత కంపెనీలు సిద్ధంగా లేకపోవడం వల్ల ఎన్‌హెచ్‌ఏఐకు (NHAI) ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అంతేకాకుండా స్టీల్‌, సిమెంటు రంగంలోని పెద్ద కంపెనీలు ఒక్కసారిగా ధరలు పెంచే ప్రయత్నాల్లో మునిగిపోతున్నాయని (Companies form Cartels) సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘డీపీఆర్‌లను సిద్ధం చేయడమే ఎన్‌హెచ్‌ఏఐకు అతిపెద్ద సవాల్‌. ఏ ప్రాజెక్టులోనూ కచ్చితమైన డీపీఆర్‌ (DPR) ఉండటం లేదు. కొత్త సాంకేతికత, నూతన పరిశోధనతో డీపీఆర్‌లను అంగీకరించేందుకు వీటితో ప్రమేయమున్న సంస్థలు సిద్ధంగా ఉండటం లేదు. అందుకే ప్రతిచోట డీపీఆర్‌ నాణ్యత కూడా చాలా తక్కువగా ఉంటోంది’ అని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా డీపీఆర్‌, కాంట్రాక్టర్లకు రేటింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధతకు సుప్రీం నో..!

మరోవైపు దేశంలో సరకు రవాణా ధరలు అధికంగానే ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. చైనాలో 8 నుంచి 10శాతం ఉండగా.. భారత్‌లో మాత్రం వీటి ఖర్చు 14 నుంచి 16శాతం ఉంటోందన్నారు. క్రిసిల్‌ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కాంక్లేవ్‌ -2023లో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. స్టీల్‌, సిమెంటు రంగంలోని పెద్ద కంపెనీలు ధరల అమాంతం పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు