భారత ప్రభుత్వానికి ₹17 కోట్లు పంపిన నీరవ్‌ సోదరి

విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సోదరి పుర్వీ మోదీ.. భారత ప్రభుత్వానికి ₹17.25 కోట్లు పంపించారు. పీఎన్‌బీ కేసులో ఇదివరకే అప్రూవర్‌గా మారిన ఆమె....

Published : 02 Jul 2021 01:16 IST

దిల్లీ: విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సోదరి పుర్వీ మోదీ.. భారత ప్రభుత్వానికి ₹17.25 కోట్లు పంపించారు. పీఎన్‌బీ కేసులో ఇదివరకే అప్రూవర్‌గా మారిన ఆమె.. యూకేలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఈ మొత్తం పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా వెల్లడించింది. జూన్‌ 24న ఈ మొత్తం పుర్వీ మోదీ ఖాతా నుంచి భారత ప్రభుత్వ ఖాతాకు బదిలీ అయినట్లు తెలిపింది. తన సోదరుడు నీరవ్‌ సూచన మేరకు పుర్వీ ఈ ఖాతా తెరిచారని, అయితే, అందులోని నగదుతో ఆమెకు సంబంధం లేదని ఈడీ పేర్కొంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB)ను మోసగించిన కేసు విషయంలో సహకరించేందుకు పుర్వీ మోదీ, ఆమె భర్త మయాంక్‌ మెహతాకు జనవరిలో ఈడీ  అనుమతిచ్చింది. దీంతో ఆమె అప్రూవర్‌గా మారింది. ఈ క్రమంలో పుర్వీ మోదీ.. 2316889.03 డాలర్లను తన యూకే ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి పంపించారని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. పుర్వీ మోదీ సహకారంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం నీరవ్‌ మోదీ యూకే జైలులో ఉన్నాడు. భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని