కేరళ తీరంలో ఇరాన్‌ పడవ స్వాధీనం

ఇరాన్‌కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్‌ గార్డ్‌ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి.

Published : 07 May 2024 04:15 IST

అదుపులో ఆరుగురు భారతీయ మత్స్యకారులు

దిల్లీ: ఇరాన్‌కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్‌ గార్డ్‌ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. చేపలు పట్టేందుకు వినియోగించే ఆ బోటులో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు గుర్తించాయి. వారంతా తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంత మత్స్యకారులు. ఇరాన్‌కు చెందిన సయ్యద్‌ సౌదీ అన్సారీ అనే వ్యక్తి వద్ద కాంట్రాక్టుపై పనిచేస్తున్నారు. యజమాని తమను దారుణంగా చూస్తున్నాడని, కనీస జీవనావసరాలు కూడా తీర్చడం లేదని వారు ఆరోపించారు. తమ పాస్‌పోర్టులను కూడా అతడు స్వాధీనం చేసుకున్నాడని తెలిపారు. దీంతో- చేపల వేటకు ఉపయోగించే పడవలోనే అక్కడినుంచి తప్పించుకొని తాము కేరళ తీరానికి చేరుకున్నట్లు వివరించారు. తదుపరి విచారణ కోసం మత్స్యకారులను కోచికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని