PM Modi: యూఏఈ అధ్యక్షుడితో కలిసి మోదీ రోడ్‌ షో..

యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు.

Published : 09 Jan 2024 22:08 IST

అహ్మదాబాద్‌: ‘వైబ్రంట్‌ గుజరాత్‌’ గ్లోబల్‌ సదస్సుకు (వీజీజీఎస్‌) హాజరైన యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌తో (Sheikh Mohamed bin Zayed Al Nahyan) కలిసి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అహ్మదాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. అంతకుముందు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న షేక్‌ మహ్మద్‌కు ప్రధాని స్వాగతం పలికారు. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల మేర రోడ్‌ షో సాగింది. గాంధీనగర్‌- అహ్మదాబాద్‌ను అనుసంధానం చేసే ఇందిరా వంతెన వద్ద ముగిసింది. ఈ రోడ్‌ షోలో మోదీ, షేక్‌ మహ్మద్‌ను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

ప్రధాని మోదీ బుధవారం వీజీజీఎస్‌ను ప్రారంభించనున్నారు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఇందుకు వేదిక కానుంది. 34 దేశాలకు చెందిన కీలక నేతలు, 16 సంస్థలకు చెందిన ప్రతినిధులు సైతం ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు దేశాల నేతలతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సదస్సు పరస్పరం వాణిజ్య సహకారాన్ని, జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, తద్వారా సుస్థిర అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని పీఎంవో వెల్లడించింది. వ్యూహాత్మక భాగస్వామ్యాలు నెలకొల్పేందుకు ఇదో చక్కని వేదిక అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని