PM Modi: సుప్రీం తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ..!

ఎంపీలు, ఎమ్మెల్యేల అవినీతిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. 

Published : 04 Mar 2024 13:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చట్టసభ సభ్యుల అవినీతిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్వాగతించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ఖాతాలో స్పందించారు. ‘‘గౌరవ సుప్రీం కోర్టు అద్భుతమైన తీర్పును ఇచ్చింది. అది భవిష్యత్తులో స్వచ్ఛమైన రాజకీయాలకు కారణమై.. వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ పోస్టుకు సుప్రీం తీర్పునకు సంబంధించిన కథనాన్ని జత చేశారు. 

లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదని నేడు సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. 

గడ్డకట్టిన కాలిఫోర్నియా.. జనజీవనానికి ఆటంకం

దేశాన్ని కుదిపేసిన 1993 నాటి జేఎంఎం ముడుపుల కేసును విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 1998లో తీర్పు వెలువరించింది. 25 ఏళ్ల తర్వాత ఈ తీర్పును పునఃసమీక్షించేందుకు గతేడాది సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. శాసనకర్తలుగా చట్టసభల సభ్యులకు విశేష హక్కులు ఉన్నప్పటికీ వారు చట్టానికి అతీతులు కాబోరని, లంచం తీసుకోవడాన్ని విచారణ పరిధి నుంచి మినహాయించడం సరికాదని నాడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని అటార్నీ జనరల్‌, సొలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనానికి తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని