Rice Shortage: బియ్యం ఎగుమతులపై నిషేధం.. అమెరికాలో ఎన్నారైల తిప్పలు

Rice Export ban triggers choas in US: బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం అమెరికాలో గందరగోళానికి దారితీసింది. చాలా చోట్ల ఎన్నారైలు బియ్యం బ్యాగుల కోసం ఎగబడ్డారు.

Published : 23 Jul 2023 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయంగా బియ్యం ధరలు అదుపు చేయడానికి బియ్యంపై నిషేధం (Rice export ban) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమెరికాలో (USA) గందరగోళానికి దారితీసింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడంతో విదేశాల్లో ఉన్న భారతీయులు బియ్యం కోసం (Rice Shortage) పోటీపడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అమెరికాలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. వార్త తెలిసిన వెంటనే ఎక్కడ ధరలు పెరుగుతాయోనన్న భయంతో చాలా మంది ఎన్నారైలు ముందుగానే సూపర్‌ మార్కెట్లకు పరుగులు పెట్టారు. 

అమెరికాతో పాటు కెనడాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా దేశాల్లో నివసించే భారతీయులు ముఖ్యంగా అన్నం ఆహారంగా తీసుకునే దక్షిణ భారతానికి చెందిన వారు బియ్యం కొనుగోళ్లకు ఎగుబడడంతో చాలా స్టోర్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. కొందరు కొన్ని నెలలకు సరిపడే బియ్యాన్ని కొనుగోలు చేయడానికి కార్లలో స్టోర్లకు చేరుకున్నారు. దీంతో కొన్ని చోట్ల క్యూలైన్లు దర్శనమిచ్చాయి. మరికొన్ని చోట్ల బియ్యం కోసం సూపర్‌ మార్కెట్లో (Super markets) ప్రజలు ఎగబడుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. ఒక్కొక్కరూ పదుల సంఖ్యలో రైస్‌ బ్యాగులను కార్లలో వేసుకెళుతున్న దృశ్యాలూ కనిపించాయి. 

ఇన్‌స్టాలో మొదటి భార్య రీల్స్‌ చూస్తున్నాడని.. భర్త మర్మాంగాలపై బ్లేడ్‌తో రెండో భార్య దాడి

ఇదే అదునుగా అమెరికాలోనూ అక్కడి సూపర్‌ మార్కెట్లు చేతివాటాన్ని ప్రదర్శించాయి. బియ్యం ఎగుమతులపై నిషేధం నేపథ్యంలో కొన్ని స్టోర్లు ధరలను భారీగా పెంచేశాయి. 18 డాలర్లుగా ఉండే 20 పౌండ్ల బియ్యం బ్యాగ్‌ ధరను ఏకంగా 50 డాలర్లకు పెంచి విక్రయిస్తున్నట్లు పలువురు ఎన్నారైలు పోస్టులు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల ఒకరికి ఒక బ్యాగే ఇస్తామంటూ కొన్ని స్టోర్లు నోటీసు బోర్డును ఏర్పాటు చేస్తున్నాయి. బియ్యం కొనుగోళ్లకు పోటెత్తడంతో ఆలస్యంగా వెళ్లిన కొందరికి నోస్టాక్‌ బోర్డు సైతం దర్శనమిచ్చిందని చెబుతున్నారు. బియ్యం ఎగుమతిని నిషేధిస్తున్నట్లు సమాచారం రాగానే స్థానిక దిగుమతి దారులు, సూపర్‌ మార్కెట్లు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని