Schengen Visas: వీసా అపాయింట్‌మెంట్‌లను నిలిపివేయలేదు: స్విస్‌ ఎంబసీ

భారత పర్యాటక గ్రూపులకు స్కెంజెన్‌ వీసాలను (Schengen visa) నిలిపివేయలేదని భారత్‌లోని స్విట్జర్లాండ్‌ (Switzerland) రాయబార కార్యాలయం వెల్లడించింది.

Published : 04 Aug 2023 02:04 IST

దిల్లీ: ఐరోపా సమాఖ్య దేశాల్లో వీసా ఆంక్షలు లేకుండా పర్యటించేందుకు జారీచేసే  వీసాల అపాయింట్‌మెంట్‌లు అక్టోబర్‌ వరకు నిలిపివేశారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా భారత్‌లోని స్విట్జర్లాండ్‌ (Switzerland) రాయబార కార్యాలయం స్పందించింది. భారత పర్యాటక గ్రూపులకు స్కెంజెన్‌ వీసాలను (Schengen visa) నిలిపివేయలేదని.. కొవిడ్‌ కంటే ముందుస్థాయిని దాటిందని స్పష్టం చేసింది. భారత్‌-స్విస్‌ పౌరుల మధ్య బంధం ఎంతో ప్రధానమైందని అభిప్రాయపడింది.

భారత పర్యాటక బృందాలకు  వీసా అపాయింట్‌మెంట్లను భారత్‌లోని స్విట్జర్లాండ్‌ ఎంబసీ నిలిపివేయలేదు. సెప్టెంబర్‌ 2023 వరకు నిత్యం దాదాపు 800 అపాయింట్‌మెంట్‌లు ఉన్నాయి. ఇందులో 22 బృందాలు ఉన్నాయి. 2019తో పోలిస్తే 2023లో ఇప్పటివరకు అత్యధిక వీసాలను జారీ చేశాం. జనవరి నుంచి జూన్‌ వరకు 1.29లక్షల దరఖాస్తులను పరిశీలించాం. కొవిడ్‌ ముందుతో పోలిస్తే 7.8శాతం ఎక్కువ’ అని పేర్కొంటూ భారత్‌లోని స్విట్జర్లాండ్‌ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

అంత్యక్రియలపై వీడియో.. ఆపై రెండు నెలలకే అందాల సుందరి మృతి

‘భారతీయుల వీసాల ప్రక్రియను ఈ ఏడాది మరింత సులభతరం చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నాం. అందులో మొదటిది.. ప్రయాణానికి ఆరు నెలల ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఇది కేవలం నెల మాత్రమే ఉండేది. రెండోది.. లఖ్‌నవూలో దరఖాస్తు కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాం. దీంతో భారత్‌లో ఈ కేంద్రాల సంఖ్య 13కు చేరుకుంటుంది. అంతేకాకుండా తమ భాగస్వామ్య విభాగం వీఎఫ్‌ఎస్‌ నుంచి దరఖాస్తు వచ్చిన తర్వాత గరిష్ఠంగా 13రోజుల్లోనే వీసాపై ఎంబసీ నిర్ణయం వెలువడుతుంది’ అని పేర్కొంటూ భారత్‌లోని స్విస్‌ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇదిలాఉంటే, ఐరోపా దేశాల మధ్య 90 రోజుల వరకు పర్యటించేందుకు వీలుగా స్కెంజెన్‌ వీసా (Schengen visa)లను జారీ చేస్తుంటారు. ఏదైనా సభ్యదేశం దీనిని జారీ చేస్తే.. దానిపై ఇతర ఈయూ దేశాల్లో పర్యటించేందుకు కూడా అనుమతి లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని