China: దక్షిణ చైనా సముద్రంపై భద్రత మండలిలో చర్చ వద్దు

ఐక్యరాజ్య సమితి భద్రత మండలి (యూఎన్‌ఎస్‌సీ) సమావేశంలో దక్షిణ చైనా సముద్రం అంశాన్ని

Updated : 12 Aug 2021 11:56 IST

అమెరికాకు అభ్యంతరం తెలిపిన చైనా 

బీజింగ్‌: ఐక్యరాజ్య సమితి భద్రత మండలి (యూఎన్‌ఎస్‌సీ) సమావేశంలో దక్షిణ చైనా సముద్రం అంశాన్ని అమెరికా లేవనెత్తటంపై చైనా తొలిసారి స్పందించింది. ఈ అంశాన్ని చర్చించడానికి యూఎన్‌ఎస్‌సీ సరైన వేదిక కాదని వ్యాఖ్యానించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆగడాలను భారతదేశం అధ్యక్షత వహించిన భద్రత మండలి సమావేశంలో అమెరికా లేవనెత్తిన నేపథ్యంలో చైనా బుధవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. సముద్ర భద్రతను పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ, ప్రాంతీయ సహకారాన్ని అమలు చేయాలని అధ్యక్ష హోదాలో భారత్‌ గత సోమవారం ప్రతిపాదించింది. యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్యదేశమైన చైనా.. ఇందుకు సంబంధించిన తీర్మానానికి ఆమోదం తెలిపింది.

అయితే.. ఇదే సమావేశంలో దక్షిణ చైనా సముద్ర అంశంపై అమెరికా చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బుధవారం కీలక ప్రకటన చేసింది. భద్రత మండలిలోని ఇతర సభ్య దేశాలు సముద్ర భద్రత సమస్యలు విస్మరించరాదని సూచించాయి. సముద్ర సంబంధిత నేరాలను ఎదుర్కోడానికి అంతర్జాతీయ, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే మార్గమని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా దక్షిణ చైనా సముద్రంపై అమెరికా చేసిన వ్యాఖ్యలను చైనా ప్రతినిధి తక్షణం ఖండించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని