MK Stalin: స్టాలిన్‌ కీలక ప్రకటన.. అగ్రి ఇన్‌స్టిట్యూట్‌కు స్వామినాథన్‌ పేరు

ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరితవిప్లవ పితామహుడు ఎం.ఎస్‌.స్వామినాథన్‌కు మరింత గౌరవం కల్పించేలా తమిళనాడు సీఎం స్టాలిన్‌ కీలక ప్రకటన చేశారు. 

Published : 11 Oct 2023 15:44 IST

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్‌ కీలక ప్రకటన చేశారు. తంజావూరులోని వ్యవసాయ కళాశాల, పరిశోధనా సంస్థకు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరితవిప్లవ పితామహుడు డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పేరు పెడుతున్నట్టు తెలిపారు. అలాగే, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్లాంట్‌ ప్రోపగేషన్‌, జెనిటిక్స్‌ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన వారిని సత్కరించేందుకు స్వామినాథన్‌ పేరిట అవార్డును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తంజావూరులోని ఈచన్‌కోట్టైలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ను డాక్టర్‌ ఎం.ఎస్‌. స్వామినాథన్‌ అగ్రికల్చరల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌గా మారుస్తామని ప్రకటించారు.

ప్రపంచ ఆర్థికాభివృద్ధి కేంద్రంగా భారత్: ప్రధాని మోదీ

పద్మవిభూషణ్‌, మెగసెసే అవార్డులతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలతో గౌరవం పొందిన స్వామినాథన్‌ను గౌరవించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 1960వ దశకంలో దేశంలో హరిత విప్లవానికి స్వామినాథన్ చేసిన కృషిని స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో ఆయన చేసిన పనిని ప్రశంసించారు. స్వామినాథన్ 1969లోనే వాతావరణ మార్పుల గురించి మాట్లాడారని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్‌ 28న ఎం.ఎస్‌.స్వామినాథన్‌ చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని