PM Modi: ప్రపంచ ఆర్థికాభివృద్ధి కేంద్రంగా భారత్: ప్రధాని మోదీ

అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధికి, ఆవిష్కరణలకు భారత్ కేంద్రంగా నిలుస్తుందనడానికి తాజా ఐఎంఎఫ్ అంచానాలు నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. 

Updated : 11 Oct 2023 11:57 IST

దిల్లీ: దేశ ప్రజల శక్తి, నైపుణ్యాల కారణంగానే ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో భారత్‌ మెరుగైన స్థానానికి చేరుకుంటోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ‘వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్’ పేరుతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ దేశాల వృద్ధి రేటు అంచనాలను విడుదల చేసింది. ఇందులో భారత్‌ వృద్ధి రేటు అంచనా 6.3 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్‌ అంచనాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘‘ దేశ ప్రజల శక్తి, నైపుణ్యాల కారణంగానే అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధికి, ఆవిష్కరణలకు భారత్‌ కేంద్రంగా నిలుస్తోంది. సుసంపన్నమైన భారత్‌ను సాధించే దిశగా మన ప్రయాణాన్ని బలోపేతం చేస్తూ ముందుకు సాగుదాం. మన సంస్కరణలను మరింత పెంచుదాం’’ అని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

భారత్-కెనడా దౌత్య వివాదం.. విదేశాంగ మంత్రుల రహస్య భేటీ..!

ఇటీవల భారత్‌ వృద్ధి రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) 6.5 శాతంగా పేర్కొంది. దానికి 0.2 శాతం తగ్గించి 6.3గా ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. గత జులైలో భారత్‌ వృద్ధి రేటును 6.1 శాతంగా ఐఎంఎఫ్ పేర్కొనడం గమనార్హం. ఈసారి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా వృద్ధి రేటు భారత్‌ కంటే తక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆ దేశంలో నెలకొన్న స్థిరాస్తి విపణి సంక్షోభం కారణంగా వృద్ధి రేటు అంచనాలను తగ్గించినట్లు ఐఎంఎఫ్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని