MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్‌ స్వామినాథన్‌ అంత్యక్రియలు: స్టాలిన్‌

అధికార లాంఛనాలతో ఎంఎస్‌ స్వామినాథన్‌ అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ వెల్లడించారు. సెప్టెంబర్‌ 30న అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు స్వామినాథన్‌ రీసెర్చి ఫౌండేషన్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

Published : 28 Sep 2023 20:21 IST

చెన్నై: భారత హరితవిప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ (98) అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు.  సుస్థిరమైన ఆహార భద్రత కోసం స్వామినాథన్ విశేష కృషి చేశారని.. దాదాపు 75 ఏళ్లుగా ఆకలి నిర్మూలన, ఆహార భద్రత అనే లక్ష్యాల కోసం అహర్నిశలు పనిచేసి వ్యవసాయరంగానికి ఓ ఐకాన్‌గా నిలిచారని కొనియాడారు. వ్యవసాయ, పర్యావరణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తగా ఎనలేని సేవలందించిన ఆయన్ను గౌరవిస్తూ పోలీసు లాంఛనాలతో అంతిమ నివాళులర్పించనున్నట్టు తెలిపారు.  మరోవైపు, స్వామినాథన్‌ అంత్యక్రియలను సెప్టెంబర్‌ 30న నిర్వహించనున్నట్టు ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చి ఫౌండేషన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఎంఎస్‌ స్వామినాథన్‌ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో గురువారం ఉదయం 11.20గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని