UK: ఒక్కరోజు.. బ్రిటిష్‌ హై కమిషనర్‌ అవుతారా?

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా 18-23 వయోవర్గానికి చెందిన భారతీయ యువతులకు ఒక్కరోజు బ్రిటిష్‌ హై కమిషనర్‌గా విధులు నిర్వహించే అవకాశాన్ని బ్రిటన్‌ కల్పిస్తోంది.

Published : 05 Aug 2023 08:58 IST

భారతీయ యువతులకు ప్రత్యేక అవకాశం

దిల్లీ: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా 18-23 వయోవర్గానికి చెందిన భారతీయ యువతులకు ఒక్కరోజు బ్రిటిష్‌ హై కమిషనర్‌గా విధులు నిర్వహించే అవకాశాన్ని బ్రిటన్‌ కల్పిస్తోంది. ఈ పోటీల్లో విజేతగా నిలిచి ప్రపంచానికి తమ ప్రతిభా సామర్థ్యాలు చాటుకునేందుకు యువతులు ఒక వీడియోను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ‘‘స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో యువత ఏరకంగా మార్గం చూపగలదు?’’ అనే ప్రశ్నకు ఒక్క నిమిషం నిడివితో సమాధానాన్ని అందులో రికార్డు చేయాలి. ఈ వీడియోను ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం లేదా లింక్డిన్‌.. ఇందులో ఏదో ఒక మాధ్యమం ద్వారా షేర్‌ చేయవచ్చు. దానికి '@UKinIndia' అని ట్యాగ్‌ చేసి, '#Dayofthegirl' అని సూచించాలి. ఆగస్టు 18లోపు ఈ దరఖాస్తులు తమకు చేరాలని, ఆ తర్వాత ఒక ఆన్‌లైన్‌ ఫాం నింపాల్సి ఉంటుందని భారత్‌లోని బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎలిస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని