vakeelsaab​: ‘మగువ..మగువ’ ఫుల్ వీడియో సాంగ్

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లో విడుదలై సందడి చేసింది. ఇందులో అంజలి, నివేదా థామస్‌, అనన్య, శ్రుతి హాసన్‌, ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రలుపోషించారు. తాజాగా సినిమాలోని ‘‘మగువా మగువా’’ ఫుల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. 

Published : 13 May 2021 18:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లో విడుదలై సందడి చేసింది. ఇందులో అంజలి, నివేదా థామస్‌, అనన్య, శ్రుతి హాసన్‌, ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా సినిమాలోని ‘‘మగువా మగువా’’ ఫుల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ గీతానికి సిధ్ శ్రీరామ్ గొంతు సవరించగా తమన్‌ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బేబి వ్యూ ప్రాజెక్ట్స్ కలిసి నిర్మించిన చిత్రానికి దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్‌ 30న ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలోనూ చిత్రం విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో పపన్ లాయర్‌ సత్యదేవ్‌గా నటించగా ప్రకాష్ రాజ్‌ అడ్వకేట్‌ నందగోపాల్‌గా పోటీ పడి నటించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని