James Bond: అమెజాన్‌ ప్రైమ్‌ అరుదైన అవకాశం.. అందుబాటులోకి 25 బాండ్‌ చిత్రాలు

1962లో ‘డాక్టర్‌ నో’తో మొదలైన బాండ్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ 25 చిత్రాలు వచ్చాయి. ఈ 25 చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అందుబాటులోకి తెచ్చింది.

Published : 06 Oct 2022 06:48 IST

ముంబయి: భాష, వయసుతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకులను సొంతం చేసుకున్న పాత్ర జేమ్స్‌బాండ్‌. తొలి జేమ్స్‌బాండ్‌ వెండితెరకు పరిచయమై 60ఏళ్లు పూర్తయ్యాయి. హాలీవుడ్‌తో పాటు, అన్ని భాషల సినిమాల్లో జేమ్స్‌బాండ్‌ మూవీలు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో బాండ్‌ అభిమానుల కోసం అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది.

1962లో ‘డాక్టర్‌ నో’తో మొదలైన బాండ్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ 25 చిత్రాలు వచ్చాయి. గతేడాది ‘నో టైమ్‌ టు డై’ 25వ చిత్రంగా విడుదలైంది. ఇప్పుడు ఈ 25 చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అందుబాటులోకి తెచ్చింది.ఇండియా, యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, స్పెయిన్‌, సౌత్‌ ఈస్ట్‌ ఏషియా ప్రాంత వాసులు వీటిని వీక్షించవచ్చు. అయితే, ఇది ఈ అవకాశం కొద్దిరోజులు మాత్రమే కల్పించనున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తెలిపింది. ఇంకెందు ఆలస్యం ఈ దసరా సెలవుల్లో నచ్చిన బాండ్‌ సినిమాలను వరుసగా చూసేయండి.

ఇవీ బాండ్‌ సినిమాలు..: డాక్టర్‌ నో (1962), ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌ (1963), గోల్డ్‌ ఫింగర్‌ (1964), థండర్‌ బాల్‌ (1965), యు ఓన్లీ లివ్‌ ట్వైస్‌ (1967), ఆన్‌ హర్‌ మెజస్ట్రీ సీక్రెట్‌ సర్వీస్‌ (1969), డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌ (1971), లివ్‌ అండ్‌ లెట్‌ డై (1973), ది మ్యాన్‌ విత్‌ గోల్డెన్‌ గన్‌ (1974), ది స్పై హూ లవ్డ్‌ మి (1977), మూన్‌రేకర్‌ (1979), ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ (1981), ఆక్టోపస్సీ (1983), ఎ వ్యూ టు ఎ కిల్‌ (1985), ది లివింగ్‌ డేలైట్స్‌ (1987), గోల్డెన్‌ ఐ (1995), టుమారో నెవ్వర్‌ డైస్‌ (1997), ది వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌ (1999), డై అనదర్‌ డే (2002), క్యాసినో రాయల్‌ (2006), క్వాంటమ్‌ ఆఫ్‌ సొలెస్‌ (2008), స్కైఫాల్‌ (2012), స్పెక్టార్‌ (2015), నో టైమ్‌ టు డై(2021)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని