Attack: దేశంలో తొలి సూపర్‌ సోల్జర్‌!

ఇప్పటివరకూ దేశాన్ని రక్షించడానికి వీరోచిత  సాహసాలు చేసే సైనికులను తెరపై చూశాం. ప్రత్యేక శక్తులతో కష్టాల్లో ఉన్నవారిని కాపాడే సూపర్‌ హీరోలనూ చూశాం. అటు సూపర్‌ హీరోల అద్భుత శక్తిని, ఇటు ఇప్పటివరకూ దేశాన్ని రక్షించడానికి వీరోచిత  సాహసాలు చేసే సైనికులను తెరపై చూశాం.

Updated : 14 Mar 2022 14:04 IST

ప్పటివరకూ దేశాన్ని రక్షించడానికి వీరోచిత  సాహసాలు చేసే సైనికులను తెరపై చూశాం. ప్రత్యేక శక్తులతో కష్టాల్లో ఉన్నవారిని కాపాడే సూపర్‌ హీరోలనూ చూశాం. అటు సూపర్‌ హీరోల అద్భుత శక్తిని, ఇటు సోల్జర్ల దేశభక్తిని పుణికిపుచ్చుకుని ఒక సూపర్‌ సోల్జర్‌ అవతరిస్తే ఎలా ఉంటుంది? ఆ అద్భుతాన్ని ప్రేక్షకులకు రుచి చూపించడానికి సిద్ధమయ్యాడు బాలీవుడ్‌ కథానాయకుడు జాన్‌ అబ్రహం. దేశంలోని తొలి సూపర్‌ సోల్జర్‌గా ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇంతకీ ఆ సూపర్‌ సోల్జర్‌ ప్రత్యేకతలేంటి? తనను ఎవరు సృష్టించారు అన్న విషయాలు తెలియాలంటే ‘అటాక్‌: పార్ట్‌1’ చూడాల్సిందే. ఇందులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌
ఆసక్తిని రేకెత్తిస్తోంది. యాక్షన్‌, సైన్స్‌ ఫిక్షన్‌ అంశాల మేళవింపుతో ఉత్కంఠభరితంగా ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్‌తో స్పష్టమవుతోంది. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని