Ram: రామోజీ ఫిల్మ్‌సిటీలో వారియర్‌ పోరాటాలు

రామ్‌ మరోసారి తన యాక్షన్‌ సత్తా చూపెట్టడానికి భారీ ఎత్తున సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ది వారియర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది.

Updated : 04 Feb 2022 07:29 IST

యాక్షన్‌ ఘట్టాల కోసం భారీసెట్లు

రామ్‌ మరోసారి తన యాక్షన్‌ సత్తా చూపెట్టడానికి భారీ ఎత్తున సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ది వారియర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా ఐదు భారీసెట్లలను ఈ సినిమా కోసం తీర్చిదిద్దారు. వాటిల్లోనే రామ్‌, ఆది పినిశెట్టి తదితరులపై కీలకమైన పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ‘ఈనాడు సినిమా’తో మాట్లాడుతూ ‘‘రామ్‌ శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ గెటప్‌కు మంచి స్పందన లభించింది. కథ డిమాండ్‌ మేరకు ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా సెట్లను తీర్చిదిద్దాం. ఫైట్‌ మాస్టర్‌ అన్బు-అరివు నేతృత్వంలో యాక్షన్‌ ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం. కర్నూలు నేపథ్యంగా సాగే ఈ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాలో కీలకంగా నిలవనున్నాయి’’ అని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి నాయికగా నటిస్తోంది. సుజీత్‌ వాసుదేవ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని