మీరు స్టార్ట్‌ చేస్తారా?వేరే ప్రాజెక్ట్‌ చూసుకోనా?

అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు-2’. ఇప్పటికే విడుదలైన ‘భారతీయుడు’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ‘భారతీయుడు-2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ విషయంలో దర్శకుడు...

Updated : 24 Oct 2020 12:18 IST

‘భారతీయుడు-2’.. శంకర్‌ అసహనం!

చెన్నై: అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు-2’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ విషయంలో దర్శకుడు శంకర్‌ తీవ్ర అసహనానికి గురైనట్లు పలు కోలీవుడ్‌ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

‘భారతీయుడు-2’ షూటింగ్‌ ప్రారంభమైన నాటి నుంచి ఏదో ఒక ఎదురుదెబ్బ తగలుతూనే ఉంది. సినిమా ప్రారంభించిన తర్వాత బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు ఆంక్షలు పెట్టారని.. దీంతో షూటింగ్‌ కొంతకాలం ఆలస్యమైందని.. కమల్‌హాసన్‌ జోక్యం చేసుకోవడంతోనే చిత్రీకరణ కొంతమేర వేగం పుంజుకుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌కి ముందు ‘భారతీయుడు-2’ సెట్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకోవడంతో షూటింగ్‌ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

కాగా, తాజాగా ‘భారతీయుడు-2’ చిత్రాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రేక్షకులకు అందించాలని శంకర్‌ భావిస్తున్నారట. అయితే నిర్మాతలు మాత్రం షూటింగ్‌ నిర్వహణకు ముందుకు రావడం లేదని, దీంతో శంకర్‌ తీవ్ర అసహనానికి గురయ్యారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన ప్రొడక్షన్‌ హౌస్‌కు ఓ లేఖ రాసినట్లు సమాచారం. షూటింగ్‌ విషయంలో తమ ఆలోచనలేంటో త్వరగా చెప్పాలని... లేకపోతే తాను వేరే ప్రాజెక్ట్‌ చేసుకునేందుకు అంగీకారమైనా తెలపాలని శంకర్‌ సదరు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దాదాపు 24 సంవత్సరాల తర్వాత శంకర్‌-కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు-2’. ఇందులో కమల్‌కు జంటగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనున్నారు. సిద్దార్థ్‌, బాబీ సింహా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని