Nagarjuna: దుబాయ్‌లో హంగామా

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా... ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌

Updated : 11 Mar 2022 13:14 IST

క్కినేని నాగార్జున కథానాయకుడిగా... ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. నాగార్జున, సోనాల్‌ చౌహాన్‌తోపాటు ప్రధాన తారాగణం చిత్రీకరణలో   పాల్గొంటోంది.  సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు చిత్రబృందం  తెలిపింది. గురువారం కొన్ని వర్కింగ్‌ స్టిల్స్‌ని విడుదల చేశాయి సినీ వర్గాలు. ‘‘నాగార్జున ఇందులో యాక్షన్‌ ప్రధానమైన పాత్రని  పోషిస్తున్నారు. ప్రవీణ్‌ సత్తారు తన శైలి థ్రిల్లింగ్‌ అంశాలతో ఒక మంచి యాక్షన్‌ సినిమాగా రూపొందిస్తున్నార’’ని చిత్రబృందం తెలిపింది. గుల్‌పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  ఛాయాగ్రహణం: ముఖేష్‌, యాక్షన్‌: రాబిన్‌ సుబ్బు, నభా, కళ: బ్రహ్మ కడలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని