Aakasam: ‘ఆకాశం’ టీజర్ చూశారా..!

అశోక్‌ సెల్వన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశం’. కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూవర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Published : 23 Sep 2022 12:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అశోక్‌ సెల్వన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశం’. కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూవర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎక్కడ ముగుస్తుందనుకుంటున్నారో, అక్కడే ప్రారంభం అవుతుందనే వ్యాఖ్యతో సినిమా పోస్టర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన చిత్రబృందం తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవ్వనుంది. చెన్నై, హైదరాబాద్‌, విశాఖపట్నంతో పాటు, గోవా, దిల్లీ, కోల్‌కత్తా తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమాకు గోపిసుందర్‌ సంగీతం అందించారు. వయాకామ్‌18 స్టూడియోస్‌తో కలిసి రైజ్ ఈస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని