Ram Charan: మూగ జీవాలపై చరణ్‌ ప్రేమ.. మురిసిపోయిన చిరంజీవి.. వీడియో

అగ్ర కథానాయకుల్లో ఒకరైన రామ్‌చరణ్‌ ఎంత సింపుల్‌గా ఉంటాడో, మూగజీవాలపై ఎంత ప్రేమ కురిస్తాడో తెలియజేసే ఓ వీడియో తాజాగా విడుదలైంది.

Published : 23 Apr 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుల్లో ఒకరైన రామ్‌చరణ్‌ ఎంత సింపుల్‌గా ఉంటాడో, మూగజీవాలపై ఎంత ప్రేమ కురిస్తాడో తాజాగా విడుదలైన ఓ వీడియోనే చెబుతోంది. ప్రపంచాన్ని మరిచిపోయి జంతువులతో చరణ్‌ మమేకమైన ఆ క్షణాల్ని తండ్రి, ప్రముఖ నటుడు చిరంజీవి తన ఫోన్‌లో బంధించారు. తన తనయుడిని అలా చూసి మురిసిపోయారు. చరణ్‌.. మేకలు, కోళ్లు, శునకాల ఆకలి, దాహార్తి తీర్చే ఆ దృశ్యం ‘ఆచార్య’ సెట్స్‌లో చోటుచేసుకుంది. ఈ ఇద్దరితో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రమిది. ఏప్రిల్‌ 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ స్పెషల్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. ధర్మస్థలి అనే ఓ ఊరి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిరుకి జోడీగా కాజల్‌ అగర్వాల్‌, చరణ్‌ సరసన పూజాహెగ్డే కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మహేశ్‌బాబు భాగమయ్యారు. ‘ఆచార్య’ కథను ఆయనే వినిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని