Balakrishna: సంక్రాంతి వేడుకల్లో బాలయ్య.. గుర్రం ఎక్కి సందడి

కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉత్సాహంగా

Updated : 15 Jan 2022 13:04 IST

కారంచేడు : కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో సోదరి దగ్గుబాటి పురందేశ్వరి, బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి వారి నివాసంలో సందడి చేశారు. గుర్రంపై ఎక్కి అభిమానులను అలరించారు.  బాలకృష్ణను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలుగు వారందరికీ బాలకృష్ణ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని