Shanmukh: ఎన్నో పరాజయాల తర్వాత సంతోషం కలిగింది: షణ్ముఖ్
గడిచిన కొంతకాలం నుంచి జీవితంలో ఎన్నో పరాజయాలు చవి చూశానని బిగ్‌బాస్ 5 ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ అన్నారు. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’, ‘సూర్య’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్‌లతో...
వైరల్‌గా మారిన యూట్యూబర్ పోస్ట్
హైదరాబాద్: జీవితంలో ఎన్నో పరాజయాలు చవి చూశానని.. బిగ్‌బాస్ 5 ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ అన్నాడు. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’, ‘సూర్య’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్‌లతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను అందుకున్న అతడు.. వ్యక్తిగత జీవితంలో బ్రేకప్ బాధ పొందుతున్నాడు. సోషల్‌మీడియాలో క్యూట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్, అతడి ప్రేయసి దీప్తి గతేడాది చివర్లో విడిపోయారు. దీంతో షణ్ముఖ్ ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాడు. సరికొత్త వెబ్‌సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇదిలా ఉండగా, కోలీవుడ్ నటుడు సూర్య అంటే షణ్ముఖ్‌కు ఎంతో ఇష్టం. ఏదో ఒక రోజు సూర్యని కలవాలనుకుంటున్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపాడు. కాగా, ‘ఈటీ’ సినిమా ప్రమోషన్స్ కోసం సూర్య గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో షణ్ముఖ్‌ని సర్ప్రైజ్ చేసేందుకు అతడి స్నేహితులు.. సూర్యని కలిసే ఏర్పాట్లు చేశారు. గురువారం మధ్యాహ్నం సూర్యని షణ్ముఖ్ కలిశాడు. తన అభిమాన నటుడ్ని చూసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యాడు. సూర్య.. షణ్ముఖ్‌ని ఆలింగనం చేసుకుని.. ‘‘నీ సిరీస్‌లు, రీల్స్ చూశాను. యాక్టింగ్ చాలా బాగుంది. భవిష్యత్తులో నువ్వు ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నా’’ అని ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘‘గడిచిన కొన్ని నెలలుగా ఎన్నో పరాజయాలు చవిచూసిన తర్వాత 3-3-2022 నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. లవ్ యూ సూర్య అన్నా’’ అని షణ్ముఖ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్‌పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్‌కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు