Tripti Dimri: ఓటీటీల్లో నటించడం ఆపను.. అలాంటి పాత్రలంటే ఇష్టం: త్రిప్తి డిమ్రి

సవాళ్లతో కూడిన పాత్రలంటే తనకు ఇష్టమని నటి త్రిప్తి డిమ్రి అన్నారు.

Updated : 30 Jan 2024 18:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీల్లో నటించేందుకు తానెప్పుడూ సిద్ధమేనన్నారు నటి త్రిప్తి డిమ్రి (Tripti Dimri). ‘యానిమల్‌’ తర్వాత ఒక్కసారిగా క్రేజ్‌  సొంతం చేసుకున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో డిజిటల్ మీడియా గొప్ప పాత్ర పోషించిందన్నారు.

‘‘యానిమల్‌’ కంటే ముందే నాపై ఎంతోమంది అభిమానం చూపించారంటే దానికి కారణం ఓటీటీలే. ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు దొరక్క గతంలో కొందరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదేళ్ల నుంచి ఆ పరిస్థితులు మారాయి. ఓటీటీ వేదికగా ఎంతోమంది వాళ్ల టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. చాలామందికి గుర్తింపు వచ్చింది. నాకు సవాళ్లతో కూడిన పాత్రలంటే ఇష్టం. అది థియేటర్లో విడుదలయ్యే సినిమానా.. ఓటీటీలో వచ్చేదా అనేది ఆలోచించను. నాకిచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేశానా లేదా అనేదే నా లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు. కార్తీక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan) హీరోగా అనురాగ్‌ బసు తెరకెక్కిస్తోన్న ‘ఆషికీ 3’లో అవకాశం వచ్చిందంటూ ప్రచారమవుతోన్న వార్తలపై స్పందించిన త్రిప్తి.. ఈ విషయంపై అధికారికంగా ఏ సమాచారం అందలేదన్నారు. తాను కూడా దానికోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ఈ ‘యానిమల్’ బ్యూటీకి తెలుగులోనూ వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. విజయ్‌ దేవరకొండ - గౌతమ్‌ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌లో త్రిప్తి నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ (Ravi teja) హీరోగా అనిల్ రావిపూడి  తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని