Vijaya Shanthi: చాలా సార్లు చావు అంచుల దాక వెళ్లొచ్చా..: విజయశాంతి

సినిమా షూటింగ్‌ల్లో తనకు జరిగిన ప్రమాదాలపై తాజాగా విజయశాంతి(Vijaya Shanthi)ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చాలాసార్లు చావు దాక వెళ్లొచ్చినట్లు చెప్పారు. 

Updated : 05 Feb 2023 16:48 IST

హైదరాబాద్‌: హీరోయిన్‌ పాత్రలకే కాకుండా లేడీ ఓరియంటెడ్‌ పాత్రలకూ ఓ ట్రెండ్‌ సృష్టించారు నటి విజయశాంతి(Vijaya Shanthi). రాములమ్మగా జనాల గుండెల్లో నిలిచిపోయారు. అంతగా గుర్తింపు తెచ్చుకుని ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. చాలా రోజుల తర్వాత మహేశ్‌ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కనిపించి అలరించారు. తాజాగా ఆమె తన సినీ ప్రయాణంలో జరిగిన ప్రమాదాల గురించి చెప్పారు.

‘‘నేను నటించిన ‘కర్తవ్యం’, ‘ప్రతిఘటన’, ‘ఒసేయ్ రాములమ్మా..’ మూడు సినిమాలు మూడు అణిముత్యాల్లా ఉంటాయి. నేను కూచిపూడి, భరతనాట్యం రెండూ నేర్చుకున్నా. అవి నా సినీ జీవితంలో చాలా ఉపయోగపడ్డాయి. నా చిన్నప్పుడే మా తల్లిదండ్రులు చనిపోయారు. అయినా నేనెవ్వరి నుంచి సాయం ఆశించలేదు. నా మొదటి రెమ్యునరేషన్‌ రూ.5వేలు అక్కడి నుంచి రూ.కోటి తీసుకునే వరకు వెళ్లాను. అప్పట్లో భారతదేశంలో ఎక్కవ రెమ్యునరేషన్‌ తీసుకున్న నటీనటులు అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ తర్వాత నేను’’ అని చెప్పారు. ‘‘జీవితంలో చాలసార్లు చావు అంచుల దాకా వెళ్లి బయటపడ్డాను. ‘లేడీ బాస్‌’ క్లైమాక్స్‌ సన్నివేశం షూటింగ్‌లో రైలు నుంచి జారి లోయలో పడబోయాను. త్రుటిలో తప్పించుకున్నాను. అంత ప్రమాదం అని తెలిసి దర్శకనిర్మాతలు ఆ సీన్‌ వద్దన్నారు. కానీ నేను మాత్రం షూట్‌ పూర్తి చేశాను. మరో సినిమా షూటింగ్‌ సమయంలో నా చీరకు, జుట్టుకు మంటలు అంటుకున్నాయి. ఇలా చాలాసార్లు నేను చావుదాక వెళ్లొచ్చా’’ అని విజయశాంతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని