Vidya Balan: ఐశ్వర్యరాయ్‌ని అనుకుని.. 60 ఆడిషన్స్‌ తర్వాత విద్యను తీసుకుని

బాలీవుడ్‌ హిట్‌ చిత్రం కోసం ముందుగా ఐశ్వర్య రాయ్‌ని తీసుకోవాలని నిర్మాత వినోద్‌ చోప్రా భావించారు. కానీ, విద్యా బాలన్‌ నటించింది. అదే సినిమా అంటే?

Published : 20 Jul 2023 18:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2005లో విడుదలై, బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన బాలీవుడ్‌ సినిమా ‘పరిణీత’ (Parineeta). ప్రేక్షకుల ఆదరణతోపాటు పలు అవార్డులనూ సొంతం చేసుకుందీ చిత్రం. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం తాజాగా బయటకు వచ్చింది. అదేంటంటే?.. ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai Bachchan) పోషించాల్సిన ప్రధాన పాత్రలో విద్యా బాలన్‌ (Vidya Balan) నటించడం.

నిర్మాత విధు వినోద్‌ చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్‌ అయితే బాగుంటుందని అనుకున్నారట. ముక్కోణపు ప్రేమకథ కావడంతో అనుభవం ఉన్న నటి అయితే న్యాయం చేయగలదనే ఆలోచన నిర్మాతకు ఉంటే.. దర్శకుడు ప్రదీప్‌ సర్కార్‌ మైండ్‌లో విద్యా బాలన్‌ ఉంది. కానీ, ఆమె అప్పటికి ఒక్క సినిమాలోనే నటించి ఉండడంతో తమ చిత్రంలోని పాత్రకు న్యాయం చేస్తుందో లేదోనని సందేహించారు. తర్వాత, ఆమెను లుక్‌ టెస్ట్‌కి పిలిచారు. ఒకట్రెండు కాదు 60 ఆడిషన్స్‌ తర్వాత విద్య నటనపై దర్శకుడికి నమ్మకం కలిగింది. అలా విద్య సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. లలితారాయ్‌ పాత్రలో ఒదిగిపోయి, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది.

ఆ మాటలు విన్నప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యాం: రామ్‌చరణ్‌

విద్యా బాలన్‌ బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రమిదే. దీనికన్నా ముందు ‘భలో థేకో’ అనే బెంగాలీ చిత్రంలో నటించింది. ‘పరిణీత’ విజయంతో విద్య వరుస అవకాశాలు దక్కించుకుంది. అతిథి పాత్రలు/ప్రత్యేక గీతాలుసహా 2007లో ఆరు సినిమాల్లో సందడి చేసింది. ‘బేగం జాన్‌’, ‘తుమారీ సులూ’, ‘శకుంతలా దేవి’ వంటి మహిళా ప్రాధాన్య చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన విద్య తాజాగా ‘నీయత్‌’ (Neeyat) సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ‘లవర్స్‌’ సినిమాలో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని