Ajith: అదరగొట్టిన హీరో అజిత్‌ టీమ్‌... షూటింగ్‌లో ఆరు మెడల్స్‌

అజిత్‌ (ajith) కేవలం నటుడు మాత్రమే కాదన్న సంగతి సినీ అభిమానులందరికీ తెలిసిందే.

Published : 31 Jul 2022 01:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అజిత్‌ (ajith) కేవలం నటుడు మాత్రమే కాదన్న సంగతి సినీ అభిమానులందరికీ తెలిసిందే. ఆయన రైఫిల్‌ షూటింగ్‌తో పాటు, బైక్‌ రేసర్‌గానూ సుపరిచితులు. తాజాగా అజిత్‌ ఆయన టీమ్‌ కలిసి రాష్ట్రస్థాయి పోటీల్లో అదరగొట్టింది. నాలుగు బంగారు పతాకాలతో పాటు, రెండు కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. తమిళనాడులో తిరిచ్చి జిల్లాలో జరిగిన పోటీల్లో  మొత్తంగా ఆరు పతకాలను కైవసం చేసుకుంది. విశ్రాంత డీజీపీ దేవరం వారికి బహుమతులతో పాటు, ప్రశంసాపత్రాలను అందించారు. సెంటర్‌ ఫైర్‌ పిస్టల్‌ మాస్టర్స్‌ మెన్‌ టీమ్‌, స్టాండర్డ్‌ పిస్టల్‌ మాస్టర్‌ టీమ్‌, 50 మీ ఫ్రీ పిస్టల్‌ మాస్టర్‌ మెన్‌, స్టాండర్డ్‌ పిస్టల్‌ మాస్టర్‌ మెన్‌ కేటగిరిల్లో బంగారు పతకాలు రాగా, 50మీటర్ల ఫ్రీ పిస్టల్‌ మెన్స్‌, స్టాండర్డ్‌ పిస్టల్‌ మెన్స్‌ టీమ్‌ టీమ్‌ కాంస్య పతకాలను గెలుచుకుంది. ప్రస్తుతం హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ నటిస్తున్నారు ‘ఏకే61’ పేరుతో షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమా ఆసక్తికర కథ,కథనాలతో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో అజిత్‌ గుబురు గడ్డంతో దర్శనమివ్వనున్నారు. గతేడాది వీరి కాంబినేషన్‌లోనే వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వాలిమై’ బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని