Akshay Kumar: నిరుత్సాహపరచొద్దు.. నాకు ధైర్యం చెప్పండి

‘బాక్సాఫీసు వద్ద నా సినిమాలు ఎలాంటి వసూళ్లను సొంతం చేసుకుంటాయని అడిగి నన్ను నిరుత్సాహపరచకండి’ అని అంటున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌.

Updated : 08 Oct 2023 13:50 IST

‘బాక్సాఫీసు వద్ద నా సినిమాలు ఎలాంటి వసూళ్లను సొంతం చేసుకుంటాయని అడిగి నన్ను నిరుత్సాహపరచకండి’ అని అంటున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌. తాను చేసిన చిత్రాలు ఎంత వసూళ్లను రాబట్టినా సమాజంలో మార్పును తీసుకొచ్చే సినిమాలు చేయడానికి అభిమానుల నుంచి ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నట్లు ఇటీవల పాల్గొన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా ‘మిషన్‌ రాణీగంజ్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన వాణిజ్యం, కంటెంట్‌ రెండు విధాలుగా హిందీ సినిమాలు మంచి విజయాన్నే అందుకుంటున్నాయన్నారు. ఆయన చేసిన సినిమాలు ఎలాంటి విమర్శలను ఎదుర్కొన్నయో గుర్తుచేసుకున్నారు.


అలాంటి సినిమాలు కూడా చేయగలను

మంచి కథాంశం, మసాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న ప్రాజెక్టులు నేను చేస్తున్నాను. ‘మిషన్‌ రాణీగంజ్‌’ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటోంది అని అడిగి ఒత్తిడికి గురిచేయకండి. వాణిజ్య పరంగానూ సినిమాలు చేసి కాసుల వర్షం కురిపించగలను. కానీ సామాజిక అంశాలతో కూడిన చిత్రాలు చేసి సమాజంలో మార్పు తీసుకొచ్చే కథలను అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది


ధైర్యాన్నివ్వండి...

‘దయచేసి నా సినిమాకు థియేటర్ల వద్ద ఎలాంటి స్పందన లభిస్తుందోనని ఆలోచించి నన్ను నిరుత్సాహపరచవద్దు. మంచి సినిమాలు తీస్తున్నారు. అవి మా పిల్లలకు కూడా చూపిస్తున్నామని నాకు ధైర్యం చెప్పండి’.


ఆ నిర్ణయం.. అందరికీ ఆశ్చర్యం

2017లో వచ్చిన ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’, ‘ప్యాడ్‌ మ్యాన్‌’(2018) లాంటి సినిమాలు చేస్తానని నిర్ణయించుకున్నప్పుడు సామాజిక మార్పును కొరుకునే సినిమాల పట్ల నేను తీసుకున్న ఆ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘నేను ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ సినిమా చేస్తున్నప్పుడు అందరు నన్ను ఏంటి ఆ టైటిల్‌? అని ప్రశ్నించారు. మీకు అర్థమవుతోందా? టాయ్‌లెట్స్‌ అనే కథనంతో ఎవరైన సినిమాలు తీస్తారా? అని వారిని అడిగాను. వారి దగ్గరినుంచి సమాధానం రాలేదు’.


ఆ సమయంలో తీసిన సినిమా అది...

కోయంబత్తూర్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కోసం తక్కువ ధరకు శానిటరీ ప్యాడ్‌లను తయారు చేసిన సామాజిక కార్యకర్త, చిన్న పారిశ్రామికవేత్త అరుణాచలం మురుగనాథం నిజజీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రమే ‘ప్యాడ్‌ మ్యాన్‌’. చేతిలో శానిటరీ ప్యాడ్‌ పట్టుకోవడానికి సాహసించని సమయంలో నేను ఆ సినిమా చేశాను. ఆ టైంలో ప్రజలు దానిని తాకడానికి కూడా సిద్ధంగా లేరు. ఆ సినిమాతో కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను.


నాకు అది చాలు..

కీలకాంశాలతో ఆగస్టు 11న విడుదలైన ‘‘ఓమైగాడ్‌ 2’ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శితమవుతోంది. దేశంలోని అన్ని మూలాల యువతకు చేరువైతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విడుదల సమయంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) మా సినిమాకు ‘ఎ’ సర్టిఫికేట్‌ ఇచ్చిందని వార్తల్లో నిలిచింది. ఎందుకు అలా చేసిందని నేను అడగను. నాకు పోట్లాడటం ఇష్టం లేదు. నాకు వాటి నిబంధనల గురించి తెలియదు. వారికి ఆ సినిమా అలా అనిపించవచ్చు అందుకే ఆ సర్టిఫికేట్‌ ఇచ్చారు. మేము ఆ చిత్రాన్ని ఎవరికి చూపించాలనుకున్నామో వాళ్లకే అది నచ్చింది. అది చాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని