Alia Bhatt: అరుదైన అవకాశం దక్కించుకున్న అలియా భట్‌ చిత్రం.. అదేంటంటే?

రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh), అలియా భట్‌ (Alia Bhatt) జంటగా నటించిన చిత్రం అరుదైన అవకాశం అందుకుంది.

Published : 05 Sep 2023 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh), అలియా భట్‌ (Alia Bhatt) జంటగా నటించిన చిత్రం ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Kii Prem Kahaani). ఈ ఏడాది జులైలో విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అరుదైన అవకాశం అందుకుంది. ‘బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ (Busan International Film Festival)లో ప్రదర్శితం కానున్న సినిమాల జాబితాలో నిలిచింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్‌కు ఎంపికైనందుకు చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ ఆనందం వ్యక్తం చేసింది. ‘ఓపెన్‌ సినిమా’ కేటగిరీలో ఈ సినిమా సెలెక్ట్‌ అయిందని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఆసియా దేశాలకు సంబంధించి యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఈ వేడుక నిర్వహిస్తుంటారు. 1996లో ప్రారంభమవగా ఇప్పటికి 27 ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ పూర్తయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు 4 నుంచి 13 వరకు ఈ వేడుక జరగనుంది.

‘బాహుబలి’ తర్వాత పాకిస్థాన్‌లోనూ అలా పిలిచారు: సత్యరాజ్‌

ప్రముఖ నిర్మాత, నటుడు, దర్శకుడు కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీనియర్‌ నటులు ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు, అలియా భట్‌.. ఉత్తమ నటిగా జాతీయ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ‘గంగూబాయి కాఠియావాడి’ సినిమాలోని నటనకుగాను ఆమెకు ఈ పురస్కారం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని