Baahubali: ‘బాహుబలి’ తర్వాత పాకిస్థాన్‌లోనూ అలా పిలిచారు: సత్యరాజ్‌

‘బాహుబలి’లో కట్టప్ప పాత్ర తనకెంతో గొప్ప పేరు తెచ్చిందని నటుడు సత్యరాజ్‌ అన్నారు. తన కొత్త సినిమాకు సంబంధించిన వేడుకలో భాగంగా ఆయన ‘బాహుబలి’ని మరోసారి గుర్తుచేసుకున్నారు.

Updated : 05 Sep 2023 13:25 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’ సిరీస్‌ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. అందులో కట్టప్పగా తన నటనతో ఆకట్టుకున్నారు సత్యరాజ్‌(Sathyaraj). తాజాగా ఆయన నటించిన ‘వెపన్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో మరోసారి ‘బాహుబలి’ (Baahubali) రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.

‘ఒక నటుడిని తన పేరుతో కంటే తన పాత్రపేరుతో పిలవడమే గొప్ప బహుమతి. ‘బాహుబలి’ తర్వాత నన్ను సత్యరాజ్‌ అని పిలవడం మానేశారు. చిన్నపెద్దా తేడా లేకుండా అందరూ కట్టప్పగానే పిలుస్తున్నారు. ఇలాంటి గుర్తింపు రావడం నటులకు విజయంతో సమానం. ‘బాహుబలి’ సినిమా తర్వాత విదేశాల్లోనూ నన్ను అదే పేరుతో గుర్తించారు. అంత గొప్ప పాత్ర చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ చిత్రం విడుదలయ్యాక రాజమౌళి జపాన్‌, పాకిస్థాన్ వెళ్లారు. అక్కడ ఓ షాపు యజమాని కూడా తనకు కట్టప్ప పాత్ర అంటేనే ఇష్టమన్నారు. వాళ్లూ నన్ను కట్టప్పగానే పిలిచారు. ఆ పాత్రకు అంతగా ఆదరణ దక్కిందంటే అది రాజమౌళి వల్లే’ అని అన్నారు. ఇక తన తాజా సినిమా ‘వెపన్‌’ కూడా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

థియేటర్‌లో విడుదలైనా, ఇప్పటికీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాని సినిమాలివే!

ఇక ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ‘వెపన్‌’పై  అంతటా ఆసక్తి నెలకొంది. ఇందులో 68ఏళ్ల సత్యరాజ్‌ను ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో 28ఏళ్ల వయసులా చూపించనున్నారు. గుహన్‌ సెన్నియప్పన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల యంగ్‌ సత్యరాజ్‌ ఏఐ ఇమేజ్‌లు కూడా నెట్టింట సందడి చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని