Aliabhatt: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో ఆ ప్రచారం తప్పు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని తన పాత్ర విషయంలో అలియాభట్‌ అసంతృప్తితో ఉందంటూ వచ్చిన వార్తలపై స్వయంగా ఆమె స్పందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా వివరణ ఇచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచంలో భాగమైనందుకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్నారామె.

Updated : 01 Apr 2022 14:07 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని తన పాత్ర విషయంలో అలియాభట్‌ అసంతృప్తితో ఉందంటూ వచ్చిన వార్తలపై స్వయంగా ఆమె స్పందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా వివరణ ఇచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచంలో భాగమైనందుకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్నారామె. అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అలియాభట్‌..సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ పాత్రకి సరైన ప్రాధాన్యం దక్కలేదని, ఆ కలతతోనే అలియాభట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వీడియో పోస్ట్‌లు తొలగించిందంటూ ప్రచారం మొదలైంది. ఈ విషయం అలియా దృష్టికి రావడంతో ఆమె స్పందించారు. ‘‘సామాజిక అనుసంధాన వేదికల్లో ఉన్న పాత వీడియోల్ని    ఎప్పటికప్పుడు తొలగిస్తూ, సరిచేస్తూ ఉంటాను. యాదృచ్ఛికంగా చేసే అలాంటి చర్యల ఆధారంగా ఎవరూ ఓ అంచనాకి రావద్దని మనవి చేస్తున్నా. సీత పాత్రలో నటించడాన్ని, రాజమౌళి దర్శకత్వంలో నటించడాన్ని ఎంతగానో ఇష్టపడ్డా. తారక్‌, చరణ్‌లతో కలిసి తెరను పంచుకోవడాన్ని ప్రేమించా. ఈ సినిమా ప్రయాణËంలో ప్రతీ అనుభవం నాకెంతగానో నచ్చింది. దర్శకుడు రాజమౌళి, ఆయన బృందం ఎన్నో ఏళ్లు శ్రమించి ఓ అందమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలాంటి సినిమా చుట్టూ తప్పుడు ప్రచారం జరగడాన్ని నివారించడం కోసమే   నేను ఈ వివరణ ఇస్తున్నా’’ అంటూ లేఖలో పేర్కొన్నారు అలియాభట్‌. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని