Allu Arjun: పుష్ప2.. అస్సలు తగ్గేదే లే

‘ఊర్వశివో రాక్షసివో’ మా కుటుంబానికి తీపి జ్ఞాపకంలాంటి సినిమా అన్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌.

Updated : 07 Dec 2022 15:42 IST

‘ఊర్వశివో రాక్షసివో’ మా కుటుంబానికి తీపి జ్ఞాపకంలాంటి సినిమా అన్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌. ఆయన సోదరుడు అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. రాకేష్‌ శశి దర్శకత్వం వహించారు. ధీరజ్‌ మొగిలినేని, విజయ్‌.ఎమ్‌, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పకులు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లు శిరీష్‌ నటన, అను ఇమ్మాన్యుయేల్‌ పాత్ర ఎంపికను మెచ్చుకున్నారు. దర్శకనిర్మాతలు, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అభిమానుల్ని ఉద్దేశించి ‘పుష్ప 1 తగ్గేదేలే అంటే, పుష్ప 2 అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా ఉంటుంద’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని