Bhanushree: నా కెరీర్‌ ఫెయిల్యూర్‌కు అల్లు అర్జున్‌ని నిందించలేదు: భానుశ్రీ

అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన ‘వరుడు’ (Varudu) సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు పంజాబీ భామ భానుశ్రీ. భారీ అంచనాల నడుమ 2010లో విడుదలైన ఈ సినిమా పరాజయాన్ని అందుకుంది.

Published : 19 Mar 2023 12:52 IST

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun)ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన కో-స్టార్‌ భానుశ్రీ (Bhanushree). ‘వరుడు’ (Varudu)లో ఆయనతో కలిసి పనిచేసినప్పటికీ తనకు అవకాశాలు రాలేదని ఆమె అన్నారు. కెరీర్‌లో ఎన్నో పరాజయాలు చవిచూశానని.. వాటి నుంచే తాను చాలా నేర్చుకుంటున్నానని తెలిపారు. అంతేకాకుండా.. ట్విటర్‌ వేదికగా బన్నీ తనని బ్లాక్‌ చేశాడని మొదట ట్వీట్‌ చేసిన ఆమె.. కొంతసేపటికే ఆయన తనని అన్‌బ్లాక్‌ చేశాడని పేర్కొన్నారు.

‘‘అల్లు అర్జున్‌తో కలిసి ‘వరుడు’ సినిమాలో నటించాను. అయినప్పటికీ నాకెలాంటి అవకాశాలు రాలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. సమస్యల్లోనే సంతోషాన్ని వెతుక్కోవడం నేర్చుకున్నాను. మరీ, ముఖ్యంగా అల్లు అర్జున్‌ ట్విటర్‌లో నన్ను బ్లాక్‌ చేశారని తెలుసుకున్నా’’ అంటూ భానుశ్రీ మొదట ట్వీట్‌ చేశారు. దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. ‘అసలు ఏమైంది?’ అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.

కాగా, మొదటి ట్వీట్‌ చేసిన మూడు గంటల తర్వాత ఆమె బన్నీ గురించి మరో ట్వీట్‌ చేశారు. బన్నీ తనని అన్‌బ్లాక్‌ చేశారని పేర్కొన్నారు. ‘‘గ్రేట్‌ న్యూస్‌.. బన్నీ నన్ను అన్‌బ్లాక్‌ చేశాడు!! నా కెరీర్‌ పరాజయానికి నేను ఆయన్ని ఎప్పుడూ నిందించలేదు. కష్టాల నుంచే ఎన్నో నేర్చుకుంటూ ముందుకు సాగిపోతున్నా’’ అని ఆమె వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని