Amitabh Bachchan: ప్రపంచమే మారిపోయినట్టు అనిపించింది..

బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రతిష్ఠాత్మక క్విజ్‌ షో ‘ కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) ఇటీవలే 1000 ఎపిసోడ్స్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి 1000 స్పెషల్‌  ఎపిసోడ్‌లో అమితాబ్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 05 Dec 2021 16:15 IST

‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ 1000 స్పెషల్‌ ఎపిసోడ్‌లో అమితాబ్‌ ఇంకా ఏమన్నారంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రతిష్ఠాత్మక క్విజ్‌ షో ‘ కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) ఇటీవలే 1000 ఎపిసోడ్స్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి 1000 స్పెషల్‌  ఎపిసోడ్‌లో అమితాబ్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమితాబ్‌ కుమార్తె శ్వేతా బచ్చన్‌, మనవరాలు నవ్యా నవేలి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ..  ‘‘  కేబీసీ వెయ్యి ఎపిసోడ్స్‌ని పూర్తి చేసుకుంది మీరు ఎలా ఫీల్‌ అవుతున్నారు’’ అని అమితాబ్‌ని అడగగా ‘‘  21ఏళ్ల క్రితం ఈ షో ప్రారంభమైంది. నాకు ఇంకా ఆ మాటలు గుర్తున్నాయి... బిగ్‌ స్క్రీన్‌ (సినిమా) నుంచి స్మాల్‌ స్క్రీన్‌ (టీవీ)కి వెళ్తున్నావ్‌ నీ ఇమేజ్‌కి అడ్డువస్తుంది అని చాలా మంది అన్నారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో సినిమాల్లో నాకు అవకాశాలూ లేవు. పరిస్థితుల దృష్ట్యా ఇటు వైపు రావాల్సి వచ్చింది. అప్పుడు ఎవరి మాటలు పట్టించుకోలేదు. ఇక ఫస్ట్‌ ఎపిసోడ్‌ ప్రసారమైయ్యాక వచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు.. ప్రపంచమే మారిపోయినట్టు అనిపించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి కంటెస్టెంట్స్‌గా వస్తుంటారు. కంటెస్టెంట్స్‌కి జ్ఞానం, ధనం, గౌరవం ఇచ్చే వేదికగా నిలిచింది ఈ షో. ఇప్పుడు 13వ సీజన్‌ కొనసాగుతుంది. మొదటి ఎపిసోడ్‌ నుంచి నేను ప్రతి కంటెస్టెంట్‌ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నా. వారి ప్రయాణాలు స్ఫూర్తిదాయకం. ఈ ఆనందం ఇదే రీతిలో కొనసాగాలని ఆశిస్తున్నా’’ అమితాబ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని