Balakrishna: బాలకృష్ణ చెప్పకపోతే 10 ఏళ్లు పట్టేదన్న దర్శకుడు.. ఐ డోంట్‌ కేర్‌ అంటూ అనసూయ రిప్లై..

‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలకృష్ణ చెప్పిన గుడ్ టచ్‌ బ్యాడ్‌ టచ్ డైలాగ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్, అనసూయల సోషల్‌మీడియా వేదికగా సంభాషించుకున్నారు.

Published : 24 Oct 2023 10:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భగవంత్ కేసరి’ సినిమాలో గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌ డైలాగు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి మంచి సన్నివేశాన్ని పెట్టినందుకు చిత్రబృందంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్‌ ఈ డైలాగ్‌పై తన అభిప్రాయాన్ని తెలియ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. దానికి అనసూయ (Anasuya) రిప్లై ఇచ్చి అనిల్‌ రావిపూడిని ట్యాగ్‌ చేశారు.

‘‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari)లో అద్భుతమైన డైలాగుతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. బాలకృష్ణ చిత్రం కాబట్టి వారం రోజుల్లోనే ఆ సందేశం ప్రజల్లోకి వెళ్లింది. ఇతర మీడియా ద్వారా అయితే 10 ఏళ్లు పట్టేది. మాస్‌ మసాల సినిమాలోనూ ఇలాంటి గొప్ప మెసేజ్‌ను పెట్టినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు. బాలకృష్ణ వల్ల మాత్రమే ఇది సులభంగా సాధ్యమైంది. అత్యంత ప్రభావవంతమైన పద్ధతిలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక ఈ సినిమాలో కాజల్‌ ఎప్పుడూ లేనంత స్టైలిష్‌గా కనిపించింది’’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

ఇక ఈ పోస్ట్‌పై అనసూయ స్పందిస్తూ.. ‘‘ఈ సినిమా గురించి ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు. నా మనసులో ఉన్న మాటలనే మీరు చెప్పారు. బాలకృష్ణ (Balakrishna) చెప్పిన చాలా డైలాగులు నేను ఇన్‌స్టా కోట్స్‌లో వాడాలనుకుంటున్నా. వాటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఐ (డోంట్‌) కేర్‌’’ అంటూ అనిల్ రావిపూడిని ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం వీరి సంభాషణ ఆకట్టుకుంటోంది.

ఇక దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తన డైలాగులతో బాలకృష్ణ ప్రేక్షకుల్లో జోష్‌ నింపుతున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ తర్వాత హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్‌ నటించగా శ్రీలీల ప్రధానపాత్రలో కనిపించింది. తాజాగా ఈ చిత్రం విజయోత్సవాలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని