Tripti Dimri: అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా: త్రిప్తి డిమ్రి

నటి త్రిప్తి డిమ్రి (Tripti Dimri) తాను ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారో చెప్పారు.

Updated : 01 Feb 2024 13:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యానిమల్‌’ (Animal) తర్వాత చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు త్రిప్తి డిమ్రి (Tripti Dimri). ఆ సినిమాలో తన నటనతో యువ హృదయాలను కొల్లగొట్టిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడారు. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పారు. కొన్ని రోజులుగా త్రిప్తి పెళ్లిపై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన ఆలోచనలన్నీ కెరీర్‌ పైనే ఉన్నాయని, ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్నారు. తనకు కాబోయే వాడికి ఆస్తి ఉన్నా.. లేకపోయినా మంచి మనసు ఉండాలని చెప్పారు. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానన్నారు.

వాళ్ల కోసమే డీప్‌ఫేక్‌ గురించి మాట్లాడాను..: రష్మిక

ఇక ‘యానిమల్‌’లో ‘జోయ’ పాత్రలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గతంలో త్రిప్తికి 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 48 లక్షలకు చేరింది. ఐఎండీబీ (ఇండియన్‌ మూవీ డేటాబేస్‌) ఇటీవల విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్ల జాబితాలోనూ ఆమె మొదటి స్థానంలో నిలిచారు. మరోవైపు ఆమెకు బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో వరుస అవకాశాలు వస్తున్నాయనే వార్తలు కూడా వైరలవుతున్నాయి. కార్తీక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan) హీరోగా అనురాగ్‌ బసు తెరకెక్కిస్తోన్న ‘ఆషికీ 3’లో అవకాశం వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda)- గౌతమ్‌ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌లోను ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ (Ravi teja) హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ త్రిప్తిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వీటిపై ఇంకా అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని