Nani: నజ్రియా.. ఎవరి ఫోన్లు లిఫ్ట్‌ చేయలేదు: నాని

‘ఈ సమ్మర్‌ మనదే.. ఇది ఫిక్స్‌’ అని అంటున్నారు నటుడు నాని. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఫన్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అంటే సుందరానికీ.. ’. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా...

Updated : 20 Apr 2022 19:31 IST

హైదరాబాద్‌: ‘ఈ సమ్మర్‌ మనదే.. ఇది ఫిక్స్‌’ అని అంటున్నారు నటుడు నాని. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఫన్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అంటే సుందరానికీ.. ’. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం టీజర్‌ విడుదల కార్యక్రమం ఏఎంబీ మాల్‌లో వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్నారు.

‘‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీజర్‌ని ఇదే స్క్రీన్‌లో అభిమానుల సమక్షంలో విడుదల చేశాం. ఆ సినిమా రిజల్ట్‌ ఎలా వచ్చిందో చూశాం. ఇప్పుడు మళ్లీ ఇదే ప్లేస్‌లో ‘అంటే సుందరానికీ..’ టీజర్‌ రిలీజ్‌ చేశాం. సినిమా రిజల్ట్‌ ఎలా ఉండనుందో మా టీమ్‌ మొత్తానికి తెలిసిపోయింది. ప్రేక్షకుల సమక్షంలో టీజర్‌ రిలీజ్‌ చేయడం నాకొక సెంటిమెంట్‌లా అయిపోయేలా ఉంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. దర్శకుడు వివేక్‌ ఏ సినిమా చేసినా.. కథను అతడు తప్ప వేరే ఎవరూ అతడికంటే బాగా చెప్పలేరు. నజ్రియాని తెలుగు సినిమాల్లోకి తీసుకురావాలని ఎంతోమంది ప్రయత్నించారు. అందుకోసం ఎందరు ఫోన్లు చేసినా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. ఎవరి రిక్వెస్ట్‌ని ఆమె ఒప్పుకోలేదు. కానీ, ఆమె మా సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపింది. అందుకు ఆమెకు ధన్యవాదాలు. చివరిగా.. టీజర్‌కు రెండు రెట్లు ట్రైలర్‌ ఉంటుంది. పది రెట్లు సినిమా ఉంటుంది’’ అని నాని వివరించారు.

టీజర్‌ చూస్తుంటే మీరు మళ్లీ ట్రెండ్‌ మార్చినట్లు ఉంది? ఇకపై కామెడీ ఎంటర్‌టైనర్స్‌ మాత్రమే చేయనున్నారా? 
నాని: అన్ని రకాల సినిమాలు చేస్తా. మీ అందరికీ విందు భోజనం పెడతా. 

ఈ సినిమా టైటిల్‌ కార్డ్స్‌పై నాని అండ్‌ నజ్రియా ఇన్‌ అని వేశారు? ఎందుకు? 
నాని: కథ ప్రకారమే అలా వేశారు. ఇది.. సుందర్‌ ప్రసాద్‌, లీలా థామస్‌ల మధ్యలో జరిగిన కథ. అందుకే అలా పెట్టి ఉంటారు. టైటిల్‌కి మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము కేవలం వచ్చి నటించి వెళ్లిపోయామంతే. 

‘బారిస్టర్‌ పార్వతీశం’ నవలకు ఈ సినిమాకీ ఏదైనా సంబంధం ఉందా?

వివేక్‌ ఆత్రేయ: అది నాకొక ఫేవరెట్‌ నవల. సినిమాకీ దానికి ఎలాంటి సంబంధం లేదు.

ఈ టీమ్‌తో కలిసి వర్క్‌ చేయడం ఎలా ఉంది?

నజ్రియ: ఇది నా మొదటి తెలుగు సినిమా. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన కథ అనిపించింది. ఈ టీమ్‌ మొత్తంతో కలిసి వర్క్‌ చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. వీళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ ప్రాజెక్ట్‌ కోసం నేను తెలుగు నేర్చుకున్నా. నేనే డబ్బింగ్‌ చెప్పుకొన్నాను.

మీరెప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అవుతున్నారు?

నాని: పాన్‌ ఇండియా అంటే ఏమిటో నాకు తెలియదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఆకట్టుకునే సినిమాలు చేస్తే.. అవే పాన్‌ ఇండియా చిత్రాలని నేను నమ్ముతా.

నజ్రియాకు ఏం చెప్పి ఈ ప్రాజెక్ట్‌ ఓకే చేయించారు?

నాని: కథ చెప్పి..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని