Nani: నజ్రియా.. ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయలేదు: నాని
‘ఈ సమ్మర్ మనదే.. ఇది ఫిక్స్’ అని అంటున్నారు నటుడు నాని. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఫన్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ.. ’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా...
హైదరాబాద్: ‘ఈ సమ్మర్ మనదే.. ఇది ఫిక్స్’ అని అంటున్నారు నటుడు నాని. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఫన్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ.. ’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం టీజర్ విడుదల కార్యక్రమం ఏఎంబీ మాల్లో వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్నారు.
‘‘శ్యామ్ సింగరాయ్’ టీజర్‌ని ఇదే స్క్రీన్‌లో అభిమానుల సమక్షంలో విడుదల చేశాం. ఆ సినిమా రిజల్ట్ ఎలా వచ్చిందో చూశాం. ఇప్పుడు మళ్లీ ఇదే ప్లేస్‌లో ‘అంటే సుందరానికీ..’ టీజర్ రిలీజ్ చేశాం. సినిమా రిజల్ట్ ఎలా ఉండనుందో మా టీమ్ మొత్తానికి తెలిసిపోయింది. ప్రేక్షకుల సమక్షంలో టీజర్ రిలీజ్ చేయడం నాకొక సెంటిమెంట్లా అయిపోయేలా ఉంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. దర్శకుడు వివేక్ ఏ సినిమా చేసినా.. కథను అతడు తప్ప వేరే ఎవరూ అతడికంటే బాగా చెప్పలేరు. నజ్రియాని తెలుగు సినిమాల్లోకి తీసుకురావాలని ఎంతోమంది ప్రయత్నించారు. అందుకోసం ఎందరు ఫోన్లు చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఎవరి రిక్వెస్ట్‌ని ఆమె ఒప్పుకోలేదు. కానీ, ఆమె మా సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపింది. అందుకు ఆమెకు ధన్యవాదాలు. చివరిగా.. టీజర్‌కు రెండు రెట్లు ట్రైలర్ ఉంటుంది. పది రెట్లు సినిమా ఉంటుంది’’ అని నాని వివరించారు.
టీజర్ చూస్తుంటే మీరు మళ్లీ ట్రెండ్ మార్చినట్లు ఉంది? ఇకపై కామెడీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేయనున్నారా?
నాని: అన్ని రకాల సినిమాలు చేస్తా. మీ అందరికీ విందు భోజనం పెడతా.
ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌పై నాని అండ్ నజ్రియా ఇన్ అని వేశారు? ఎందుకు?
నాని: కథ ప్రకారమే అలా వేశారు. ఇది.. సుందర్ ప్రసాద్, లీలా థామస్‌ల మధ్యలో జరిగిన కథ. అందుకే అలా పెట్టి ఉంటారు. టైటిల్‌కి మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము కేవలం వచ్చి నటించి వెళ్లిపోయామంతే.
‘బారిస్టర్ పార్వతీశం’ నవలకు ఈ సినిమాకీ ఏదైనా సంబంధం ఉందా?
వివేక్ ఆత్రేయ: అది నాకొక ఫేవరెట్ నవల. సినిమాకీ దానికి ఎలాంటి సంబంధం లేదు.
ఈ టీమ్‌తో కలిసి వర్క్ చేయడం ఎలా ఉంది?
నజ్రియ: ఇది నా మొదటి తెలుగు సినిమా. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన కథ అనిపించింది. ఈ టీమ్ మొత్తంతో కలిసి వర్క్ చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. వీళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ ప్రాజెక్ట్ కోసం నేను తెలుగు నేర్చుకున్నా. నేనే డబ్బింగ్ చెప్పుకొన్నాను.
మీరెప్పుడు పాన్ ఇండియా స్టార్ అవుతున్నారు?
నాని: పాన్ ఇండియా అంటే ఏమిటో నాకు తెలియదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఆకట్టుకునే సినిమాలు చేస్తే.. అవే పాన్ ఇండియా చిత్రాలని నేను నమ్ముతా.
నజ్రియాకు ఏం చెప్పి ఈ ప్రాజెక్ట్ ఓకే చేయించారు?
నాని: కథ చెప్పి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్‌పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్‌పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్‌కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్‌కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్‌కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్‌లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్‌తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్‌ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్‌లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి