Anushka Shetty: అనుష్క చిత్రం... ఘాటి

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రధారిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  యు.వి.క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి.

Updated : 20 Mar 2024 10:51 IST

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రధారిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  యు.వి.క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్‌ రెడ్డి నిర్మాతలు. నాయికా ప్రధానమైన ఈ చిత్రానికి ‘ఘాటి’ అనే పేరుని ఖరారు చేశారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ సినిమా పేరుని, ప్రీ లుక్‌ని మంగళవారం విడుదల చేశారు. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతీకారం ప్రధానంగా సాగుతుంది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తర్వాత అనుష్క నటిస్తున్న ఈ చిత్రానికి చింతకింది శ్రీనివాస్‌రావు, క్రిష్‌, బుర్రా సాయిమాధవ్‌ రచన చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని